HTML
| HTML | |
| 132px| | |
| పేరు | HTML |
|---|---|
| పొడిగింపు |
|
| అంతర్జాలమాధ్యమ రకం | text/html |
| విడుదలతేదీ | 1993 |
| వీటిని కలిగివుంటుంది | HTML elements |
| దీని నుండి పొడిగించబడింది | SGML |
హైపర్‌టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ (Hypertext Markup Language - HTML) అనేది వెబ్ బ్రౌజర్లలో (జాల విహరిణి) చూసే డాక్యుమెంట్లను రూపొందించడానికి వాడే ప్రామాణిక మార్కప్ లాంగ్వేజ్. ఇది వెబ్ పేజీలో చూపించాల్సిన అంశాన్ని, దాని నిర్మాణాన్ని నిర్దేశిస్తుంది. దీనికి సహాయంగా కాస్కేడింగ్ స్టైల్ షీట్ (CSS), జావాస్క్రిప్టు (JavaScript) పనిచేస్తాయి.
వెబ్ బ్రౌజర్లు సాధారణంగా వెబ్ సర్వర్ల నుంచి కానీ, లోకల్ స్టోరేజ్ నుంచి కానీ HTML డాక్యుమెంట్లను తెచ్చుకుని మల్టీమీడియా వెబ్ పేజీల రూపంలో ప్రదర్శిస్తుంది. HTML పేజీలకు మూలం HTML ఎలిమెంట్స్ లేదా ట్యాగ్స్.
చరిత్ర
[మార్చు]ఆంగ్ల కంప్యూటర్ శాస్త్రవేత్త టిమ్ బెర్నర్స్ లీ 1980లో జెనీవాలో ఉండగా పరిశోధకులు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకుగా వీలుగా హైపర్ టెక్స్ట్ ఆధారంగా ఒక ప్రాజెక్టు కోసం ప్రతిపాదన చేశాడు.[1] దాన్ని అందరికీ తెలియజేసేందుకు ఎంక్వైర్ అనే నమూనాను తయారు చేశాడు.[2] 1989 లో అంతర్జాల ఆధారిత హైపర్‌టెక్స్ట్ సిస్టం కోసం ఒక ప్రతిపాదన చేశాడు.[3] దీని ఆధారంగా 1990 చివరలో HTML కి రూపకల్పన చేసి, వెబ్ బ్రౌజరు అభివృద్ధి చేశాడు.
HTML ట్యాగ్లు మరియు ఎలిమెంట్లు ఏమిటి?
[మార్చు]HTML ట్యాగ్లు అనేవి కోణాకార బ్రాకెట్ల ( < > ) లో ఉండే ప్రత్యేక కీవర్డ్లు, ఇవి వెబ్ కంటెంట్ ఎలా చూపించబడాలో నిర్వచిస్తాయి. ఎక్కువ ట్యాగ్లు ఓపెనింగ్ మరియు క్లోసింగ్ జంటలో ఉంటాయి, కానీ కొన్ని స్వయంగా ముగుస్తాయి.[4]
ఉదాహరణకి:
<p>ఇది ఒక పేరాగ్రాఫ్</p>
HTML Attributes ఏమిటి?
[మార్చు]Attributes అనేవి అదనపు సమాచారాన్ని (additional information) కలిగి ఉంటాయి. Attributes ను ఓపెనింగ్ ట్యాగ్‌లో ఉంచి, అదనపు సమాచారం ఆలోపల ఇవ్వబడుతుంది.[5]
ఒక Attribute ఉదాహరణ:
<img src="mydog.jpg" alt="నా కుక్క ఫోటో">
ఈ ఉదాహరణలో, image source (src) మరియు alt text (alt) అనేవి <img> ట్యాగ్ యొక్క attributes అవుతాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Berners-Lee's original proposal to CERN". w3.org. World Wide Web Consortium. March 1989. Retrieved 25 May 2008.
- ↑ Stewart, Bill. "Tim Berners-Lee, Robert Cailliau, and the World Wide Web". Retrieved 22 July 2010.
- ↑ Tim Berners-Lee, "Information Management: A Proposal". CERN (March 1989, May 1990). W3C.
- ↑ "HTML Interview Questions to Crack Your Next Interview". www.ccbp.in (in ఇంగ్లీష్). Retrieved 2025-11-14.
- ↑ "HTML For Beginners The Easy Way: Start Learning HTML & CSS Today".